హైదరాబాద్ నుండి దూరంగా .... ఒకరోజు, ఎక్కడికయినా పారిపోవలనిపిస్తే మాత్రం.... హైదరాబాద్ కి దగ్గరలో, అంటే ఒక ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉండే వికారాబాద్ => అనంతగిరి హిల్స్ కి కచ్చితంగా వెళ్ళొచ్చు....
దూరం గా అని దగ్గర ప్లేస్ చెప్తున్నా అనుకుంటున్నారా?
దూరం తక్కువయినా... మనం మాత్రం ఎక్కడికో వెళ్లినట్టు వుంటుంది...
అక్కడ పట్టుమని పది మంది కూడా కనిపించలేదు నేను వెళ్ళినప్పుడల్లా... అందుకే చాలా ప్రశాంతంగా.... హాయిగా ఉంటుంది...
అసలు రోడ్డు సూపర్...
గుడి సూపర్..
ఆ అడవి ఇంకా సూపర్.. (ఆ అడవి లో చాలా సినిమా షూటింగులు కూడా అయ్యాయి... )
ఒక అయిదారుగురు స్నేహితులతో వెళితే ఇంకా సూపర్...
నేనయితే ఒక ఇయర్ గాప్ లో, మూడుసార్లు వెళ్ళా...
ఏమిటో గాని ఇక్కడ ఎండలు మండిపోతున్నా గాని.. అక్కడ మాత్రం చల్లగా.. ఇంకాసేపట్లో వర్షం పడుతుందేమో అన్నంత హాయిగా ఉంటుంది...
ఇంకా బాగా చెప్పాలని ఉంది కాని చెప్పటం రాట్లేదు..
వీలయితే ఒక రోజు వెళ్ళిరండి..
1 comment:
ఫోటోలు బాగున్నాయి. ఈ ప్రదేశం గురించి, వెళ్ళాల్సిన దారి, ప్రయాణ సమయం, అక్కడ చూడదగినవి లాంటి మరిన్ని వివరములు అందించగలరు.
మీకు బ్లాగు రాయడానికి సమయం లేకపోతే నాకు ఈ-మెయిల్ చేయగలరు : yjbasu510@yahoo.co.in
Post a Comment