August 5, 2011

ఈ చుట్టాలున్నారే....





ఈ చుట్టాలున్నారే....


స్కూల్ లోనో, కాలేజీ లోనో చదివే వయసులో ఏవయినా పెళ్ళిళ్ళకి కాని, మరేవయినా శుభకార్యాలకి కాని వెళితే...


"ఏరా బాగున్నావా?" అని అడిగినా అడగకపోయినా, మరో రెండు ప్రశ్నలు మాత్రం కచ్చితంగా అడుగుతారు..


"ఏం చదువుతున్నావ్ అబ్బాయి...??" .... "బాగా చదువుతున్నావా???"....


ఆ ప్రశ్నలకి పదే పదే జవాబులు చెప్పలేక... తప్పించుకుని తిరగాలి...


సరే ఎలాగోలా చదువులు అయిపోయాయి... ఇక మనం చుట్టాల ముందు తలెత్తుకు తిరగొచ్చు అని సంబరాపడ్డామో... ఆ సంబరం సగం రోజయినా ఉండదు...


మళ్ళీ రెండు ప్రశ్నలు...


"ఏం చేస్తున్నావ్ అబ్బాయ్...?" ... "ఇంకా జాబు దొరకలేదా???"


ఇక మళ్లీ హైడ్ అండ్ సీక్ మొదలు...


హమ్మయ్య... జాబు వచ్చేసింది...  ఇక కష్టాలు గట్టేక్కాయి అనుకునేలోగా... మళ్ళీ ప్రశ్న..
"పెళ్ళెప్పుడు...???"


ఛీ జీవితం..... అనుకోని, సరే పెళ్ళికి ఓకే అంటే ఓ పనయిపోతుంది... మన భాద్యత తీరిపోతుంది అనుకున్నామా... అంతే సంగతులు... అసలు టార్చర్ అప్పుడే స్టార్ట్...


మొదట "నేడే విడుదుల..." అన్నట్టు ఒక ప్రొఫైల్ రెడీ చేయాలి...


అందులో.. మన పదవ తరగతి మార్కుల దగ్గరి నుండి మొదలెట్టి... tax లు పోగా మన జీతం ఎంత వస్తుందో వరకి రాపిస్తారు...


తర్వాత మార్కెట్ లోకి రిలీజ్ చేయటానికి ఓ మూడు నాలుగు ఫొటోస్ దిగాలి...


మన దగ్గర మొబైల్ లో దిగినవి ఉన్నాయి కదా... వాటినే ప్రింట్ తీద్దాం అని అన్నమో....


ఒక పెద్ద శబ్దం నోఓఓఓఒ........... అని...


ఏవి పడితే అవి ఇవ్వకుదాడట... :(


స్టూడియో కి వెళ్లి....


"నిల్చుని ఒకటి..."


"కూర్చుని ఒకటి...."


"ఫార్మల్ డ్రెస్ లో ఒకటి..."


"క్యాసుఅల్ డ్రెస్ లో మరోటి.."


ఇక ఫోటోలు తీసేవాడు మనని ఆడుకుంటాడు చూడండి... :(


"సరిగ్గా నించో..."


"కాస్త నవ్వు..."


"అబ్బ.. మరీ అంతల నవ్వొద్దు బాబు...పైన మూడు పళ్ళు... కింద రెండు పళ్ళు మాత్రమె కనిపించాలి..."


%%&##$%^^


ఇంత వయసొచ్చినా మనకి నిలుచోటం రాదంటూ... కూర్చోటం తెలిదంటు.... విసిగించి... ఏడిపించి... అవమానించి.... మన చేతిలో ఫోటోలు పెడతాడు...


ఇక చుట్టాలకి మన ప్రొఫైలు, ఫోటోలు అందగానే.... మనని ఎగాదిగా  చూసి...


"అబ్బే... ఆ తల అలా పైకి దువ్వుకోవటం ఎంటబ్బాయ్... కాస్త పద్దతిగా ఉండాలి..."


"కుర్ర చేష్టలు తగ్గించుకోవాలి..." 


ఇలా మనని మూడు దొంగతనాలు, ఆరు హత్యలు చేసిన దోషిలా చూసి.... :( :(
"సరే.. ఏదో ఒకటి చూద్దాంలే... " అని మొహం చిరాగ్గా పెట్టి... ఏదో సంఘ సేవ చేసినట్టు ఫీలవుతుంటారు...


ఓ నాలుగయిదు సంబందాలు చూసాక... ఏది కుదరకపోతే....


"అబ్బే... ఇలా అయితే నీకు పెళ్లి కాదబ్బాయ్..."


ఇంట్లో వాళ్లకి గుండె దడ మొదలు...


"పోయిన నెలలో మీ ఫ్రెండ్ ఎవడికో పెల్లయిన్దన్నావ్ కదా... అతనితో  మాట్లాడు..." అని అమ్మ...


"నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో... " అని నాన్న...


పొరపాటున వాణ్ని అడిగామా... మనతో పాటు ఫెయిల్ అవుతూ వస్తున్నా స్నేహితుడు, నలబై మార్కులతో పాసయి, "ఎగ్జామ్స్ లో పాసవడం ఎలా??" అని ఓ నాలుగయిదు చిట్కాలు చెప్తాడు...


ఛి జీవితం...




పెళ్లి ఎపుడవుతుందో... ఏమో...


అయ్యాకయినా ఈ చుట్టాలు మనని ప్రశాంతంగా ఉండనిస్తారో లేదో... :( :(







August 3, 2011

పాపం... మేనేజరు గారు...*

క్రితం వారం వరకు ప్రాజెక్టు పనిలో బాగా బిజీగా గడిపిన మా టీం మెంబెర్స్ అంతా, ఈ వారం తమ తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు (ఆఫీసులో నుండే లెండి)...

మేము బిజీ గా ఉన్న రోజుల్లోనే కాస్త కాళిగా ఉన్న మా మేనేజరు గారు, ఈ వారం ఎలా ఉన్నాడో నేను చెప్పాల్సిన అవసరం లేదేమో :) ఏం చేయాలో అస్సలు తోచట్లేదు పాపం :)

మధ్యాహ్న భోజనం ముగించిన తర్వాత, ఎక్కడ నిద్రోస్తుందో అని కాఫీ తాగే అలవాటు ఉన్న మా మేనేజరు గారు... నిన్న మధ్యాహ్నం కూడా కాఫీ తాగటానికి క్యాంటీన్ వైపు వెళ్ళాడు... 

అందరి భోజనాలు అయిపోవటంతో, క్యాంటీన్ బాయ్ రాము టేబుల్స్ క్లీన్ చేసే పనిలో ఉన్నాడు...

రామును చూడగానే మా మేనేజరు గారికి, వీడితో సరదా చేసి కాస్త సమయం వృధా చేయోచ్చనే అద్భుతమయిన ఆలోచన వచ్చింది (పాపం తనకి తెలీదు రాము ఒక షాక్ ఇస్తాడని)...


మేనేజరు గారు: ఏం రాము, ఎప్పుడు చూసినా ఏదో చేస్తుంటావు. ఎంత సంపాదిస్తావేంటి??
రాము:  :)  (చిరునవ్వే సమాధానం)


మేనేజరు గారు: భవిష్యత్తు లో ఏం చేద్దామని??
రాము:  (నిశ్శబ్దం)


మేనేజరు గారు: టెన్ ఇయర్స్ తరువాత నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకున్టున్నావ్??
రాము:  (మేనేజరు గారి వైపే చూస్తూ...)


(ఈ మౌనం భరించలేని మా)...
మేనేజరు గారు: నేను హైదరాబాదుకి వచ్చినప్పుడు నా దగ్గర ఏదీ లేదు... ఇప్పుడు చూడు, నా దగ్గర లేనిది లేదు...


పేరుంది...


స్టేటస్ ఉంది..


కారుంది..


ఇల్లుంది...


బ్యాంకు ఎకౌంటు లో కావాల్సినంత డబ్బుంది...


నీ దగ్గరేముంది ... హా... ఏముంది...?? (కాస్త గట్టిగానే అడిగాడు)

;

రాము దగ్గర ఏముందో తెలుసా... ఏముందని చెప్పాడో తెలుసా... ?


అదేదో హిందీ సినిమా లో శశి కపూర్ చెప్పినట్టు "అమ్మ ఉంది..." అని చెప్పలేదనుకొండి...


రాము చెప్పిన సమాధానం.......


;;;;;




;;;;




;;;




;;




;



రాము: నాకు పనుంది సార్....




:) :)




పాపం మేనేజరు గారు, మారు మాట్లాడకుండా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు... :)



గమనిక: ఇది మా ఆఫీసు లో జరిగిన విషయం కాదు... ఒకానొక ఫార్వర్డ్ మెయిల్ లోని విషయానికి, నా పైత్యం జోడించి రాయడమైనది ... (అందుకే టైటిల్ లో * పెట్టా :)

అచ్చి రాని రెండవ స్థానం







నేను రాజకీయ వార్తలు పేపర్లో చదవడం మొదలెట్టాక (అంటే అంతకు ముందు పేపర్ చదివినా కేవలం స్పోర్ట్స్ అండ్ సినిమా న్యూస్ వరకే పరిమితం)... తెలుగు దేశం పార్టీ లో చంద్రబాబు గారి స్థానం మారక పోయినా చంద్రబాబు తర్వాతి స్థానం మాత్రం అనుకోని పరిస్థితుల్లో మారుతూ వచ్చింది...


కొంత కాలం పాటు రెండవ స్థానంలో ఎలిమినేటి మాధవ రెడ్డి గారు ఉన్నారు. ఆ స్థానం లో పాతుకుపోతున్న సమయం లో అనుకోని విధంగా నక్సలైటుల చేతిలో చనిపోయారు...


వెనువెంటనే రెండవ స్థానం లో ఎవరి పేరు వినిపించకపోయినా,  ఆతర్వాతి కాలం లో దేవేందర్ గౌడ్ గారు రెండవ స్థానం లో చాలా కాలంపాటు ఉన్నారు... అనుకోని పరిస్తుతుల్లో తెలంగాణా విషయమై అదినేత చంద్రబాబు గారితో విభేదించి, దేవేందర్ గౌడ్ గారు పార్టీ వీడటం జరిగింది...


అలా మరుకోన్నాల్ల పాటు రెండవ స్థానం కాలిగా ఉండింది... ఇంతలో నాగం జనార్ధన్ రెడ్డి గారు తన వాగ్దాటితో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగి రెండవ స్థానానికి అర్హత సంపాదించారు... ఇక రెండవ స్థానంలో నాగం జనార్ధన్ రెడ్డి గారు స్థిరపడ్డారు, అని మనమంతా అనుకునే లోపునే... తెలంగాణ విషయమై నాగం జనార్ధన్ రెడ్డి గారు ఎదురుతిరగటం... పార్టీ నుండి బహిష్కరణకు గురికావటం జరిగాయి....


ఇక మళ్లీ రెండవ స్థానం ఖాళీ.... మరీ ఇప్పుడున్న పార్టీ నాయకులలో రెండవ స్థానం ఎవరిది????


(నాకయితే ఆ స్థానాన్ని ఎర్రబల్లి దయాకర్ రావు గారు బర్తీ చేస్తారనిపిస్తుంది... మీరేమంటారు???? ఒకవేళ చేసినా ఎంతకాలం ఉంటారు???? )







ముఖంపై నల్ల మచ్చలా?.... - నల్ల మచ్చలు కనిపిస్తే ఒట్టు.....

మా ఆఫీసు లో నాతో పాటే జాయిన్ అయిన స్నేహితుడోకడున్నాడు.


ప్రాజెక్టులు వేరు వేరు అవడం చేత వాడిది రెండవ అంతస్తు, నాది మొదటి అంతస్తు.


వారానికి రెండు సార్లు కాఫీ బ్రేక్ కి కలసి వెళ్లి కష్టసుఖాలు చెప్పుకుంటాం.


ఆమధ్య వాడికో సమస్య వచ్చి పడింది.


ఏంటంటే ముఖంపై నాలుగైదు నల్ల మచ్చలు.


ఇక వీడు బెంగేట్టేసుకున్నాడు.


వీడి రంగు చమన చాయ అవటం తో... అవి కనీ కనిపించనట్టు ఉన్నాయనుకోండి... అది వేరే విషయం...


కాని, అసలే పెళ్లి కావాల్సిన వయసు, పైగా ఇంట్లో సంబంధాలు చూడటం మొదలెట్టేసారు.


ఇక బెంగేట్టుకోడా మరి.


జగన్ లా మనం ఓదార్చాల్సినంత  పెద్ద సమస్యేం కాదు.... అలా అని చిన్న సమస్య కూడా కాదు...


సర్లే ఒక వారం చూద్దామని చెప్పాను.


మరుసటి వారం కలిసినప్పుడు మార్పేమీ గమనించలేదు... మచ్చల విషయంలోను, వాడి బాధ విషయంలోను...


ఇంకో వారం చూద్దామని వాడు డిసైడ్ అయ్యాడు... అంతలోనే వారం గడచిపోయింది...


ఇక లాభం లేదని గూగుల్ లో మంచి క్రీముల కోసం సెర్చ్ చేయటం ప్రారంభించాడు.


రెండురోజుల తర్వాత కలిసినప్పుడు, యుద్ధం గెలవడానికి తిరుగులేని ఆయుదమేదో సాదించినట్టు వెలిగిపోతుంది వాడి ముఖం.


ఆరాతీస్తే చెప్పాడు, ఒక క్రీము పేరు... దాన్ని కొనేసాడు ఆ ఉదయమే అని...


ఇదే ఎందుకని నా ప్రశ్న, కాప్షన్ వాడి జవాబు...


కాప్షన్ ఏంటంటే...


"ముఖంపై నల్ల మచ్చలా? మా క్రీము వాడండి ఒక వారం రోజులు.... నల్ల మచ్చలు కనిపిస్తే ఒట్టు..."


నాకు కూడా బానే ఉందనిపించింది...


నా ప్రాజెక్టు పీక్ స్టేజి లో ఉండడం చేత, ఒక వారం కలవడానికి వీలు పడలేదు....


మరు వారం వాడి పని ఒత్తిడి కారణంగా కలవలేదు....


తరువాతి వారం వాడ్ని చూసినప్పుడు.... ఆశ్చర్యం... నాకు నోట మాటరాలేదు....


ఆర్య-2 సినిమా లో పాడినట్టు "లేన్సేసి.... వెతుకు..... దొరకదు ఏ డిఫెక్ట్...",


బూతద్దం వేసి వెతికినా నల్ల మచ్చలు కనిపించవేమో...


@#$%#$^M & &**********


ఏంటి... మీ సమస్య కు పరిష్కారం దొరికిందని సంభర పడుతున్నారా?


ఆ క్రీము పేరేదో చెప్తే... నాకు రుణపడి పోదామనుకుంటున్నారా ????


ఆగండాగండి....


అసలు విషయమేంటంటే....


వాడి ముఖం నల్లగా మారిపోయింది... హతోస్మి ..... ఇక నల్ల మచ్చలెం కనిపిస్తాయి???


సారాంశం: పున్నమి చంద్రుడవుదామని ఆశ పడితే... అమావాస్య చంద్రుడయ్యాడు పాపం....