August 5, 2011

ఈ చుట్టాలున్నారే....





ఈ చుట్టాలున్నారే....


స్కూల్ లోనో, కాలేజీ లోనో చదివే వయసులో ఏవయినా పెళ్ళిళ్ళకి కాని, మరేవయినా శుభకార్యాలకి కాని వెళితే...


"ఏరా బాగున్నావా?" అని అడిగినా అడగకపోయినా, మరో రెండు ప్రశ్నలు మాత్రం కచ్చితంగా అడుగుతారు..


"ఏం చదువుతున్నావ్ అబ్బాయి...??" .... "బాగా చదువుతున్నావా???"....


ఆ ప్రశ్నలకి పదే పదే జవాబులు చెప్పలేక... తప్పించుకుని తిరగాలి...


సరే ఎలాగోలా చదువులు అయిపోయాయి... ఇక మనం చుట్టాల ముందు తలెత్తుకు తిరగొచ్చు అని సంబరాపడ్డామో... ఆ సంబరం సగం రోజయినా ఉండదు...


మళ్ళీ రెండు ప్రశ్నలు...


"ఏం చేస్తున్నావ్ అబ్బాయ్...?" ... "ఇంకా జాబు దొరకలేదా???"


ఇక మళ్లీ హైడ్ అండ్ సీక్ మొదలు...


హమ్మయ్య... జాబు వచ్చేసింది...  ఇక కష్టాలు గట్టేక్కాయి అనుకునేలోగా... మళ్ళీ ప్రశ్న..
"పెళ్ళెప్పుడు...???"


ఛీ జీవితం..... అనుకోని, సరే పెళ్ళికి ఓకే అంటే ఓ పనయిపోతుంది... మన భాద్యత తీరిపోతుంది అనుకున్నామా... అంతే సంగతులు... అసలు టార్చర్ అప్పుడే స్టార్ట్...


మొదట "నేడే విడుదుల..." అన్నట్టు ఒక ప్రొఫైల్ రెడీ చేయాలి...


అందులో.. మన పదవ తరగతి మార్కుల దగ్గరి నుండి మొదలెట్టి... tax లు పోగా మన జీతం ఎంత వస్తుందో వరకి రాపిస్తారు...


తర్వాత మార్కెట్ లోకి రిలీజ్ చేయటానికి ఓ మూడు నాలుగు ఫొటోస్ దిగాలి...


మన దగ్గర మొబైల్ లో దిగినవి ఉన్నాయి కదా... వాటినే ప్రింట్ తీద్దాం అని అన్నమో....


ఒక పెద్ద శబ్దం నోఓఓఓఒ........... అని...


ఏవి పడితే అవి ఇవ్వకుదాడట... :(


స్టూడియో కి వెళ్లి....


"నిల్చుని ఒకటి..."


"కూర్చుని ఒకటి...."


"ఫార్మల్ డ్రెస్ లో ఒకటి..."


"క్యాసుఅల్ డ్రెస్ లో మరోటి.."


ఇక ఫోటోలు తీసేవాడు మనని ఆడుకుంటాడు చూడండి... :(


"సరిగ్గా నించో..."


"కాస్త నవ్వు..."


"అబ్బ.. మరీ అంతల నవ్వొద్దు బాబు...పైన మూడు పళ్ళు... కింద రెండు పళ్ళు మాత్రమె కనిపించాలి..."


%%&##$%^^


ఇంత వయసొచ్చినా మనకి నిలుచోటం రాదంటూ... కూర్చోటం తెలిదంటు.... విసిగించి... ఏడిపించి... అవమానించి.... మన చేతిలో ఫోటోలు పెడతాడు...


ఇక చుట్టాలకి మన ప్రొఫైలు, ఫోటోలు అందగానే.... మనని ఎగాదిగా  చూసి...


"అబ్బే... ఆ తల అలా పైకి దువ్వుకోవటం ఎంటబ్బాయ్... కాస్త పద్దతిగా ఉండాలి..."


"కుర్ర చేష్టలు తగ్గించుకోవాలి..." 


ఇలా మనని మూడు దొంగతనాలు, ఆరు హత్యలు చేసిన దోషిలా చూసి.... :( :(
"సరే.. ఏదో ఒకటి చూద్దాంలే... " అని మొహం చిరాగ్గా పెట్టి... ఏదో సంఘ సేవ చేసినట్టు ఫీలవుతుంటారు...


ఓ నాలుగయిదు సంబందాలు చూసాక... ఏది కుదరకపోతే....


"అబ్బే... ఇలా అయితే నీకు పెళ్లి కాదబ్బాయ్..."


ఇంట్లో వాళ్లకి గుండె దడ మొదలు...


"పోయిన నెలలో మీ ఫ్రెండ్ ఎవడికో పెల్లయిన్దన్నావ్ కదా... అతనితో  మాట్లాడు..." అని అమ్మ...


"నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో... " అని నాన్న...


పొరపాటున వాణ్ని అడిగామా... మనతో పాటు ఫెయిల్ అవుతూ వస్తున్నా స్నేహితుడు, నలబై మార్కులతో పాసయి, "ఎగ్జామ్స్ లో పాసవడం ఎలా??" అని ఓ నాలుగయిదు చిట్కాలు చెప్తాడు...


ఛి జీవితం...




పెళ్లి ఎపుడవుతుందో... ఏమో...


అయ్యాకయినా ఈ చుట్టాలు మనని ప్రశాంతంగా ఉండనిస్తారో లేదో... :( :(







3 comments:

Unknown said...

lol.. :) pelli ayyaka.. "pillalu eppudu.. :P ?? " ani visigidtaaru... !!! ee torture ki anthu ledhu...

గీతిక బి said...

ha ha..
nice post

రాజేష్ మారం... said...

@Nicky.. yeah :(
@Geetika .. Thank you.. :)