September 16, 2011

ఇల్లా??... పెళ్ళా?...


పెళ్లి కోసం మన బయో-డేటా విడుదల చేసాం కాబట్టి...
మొన్న నేను ఆఫీసు లో ఉన్న సమయం లో ఒక కాల్ వచ్చింది...


ఆ సంభాషణ క్రింది విధంగా సాగింది... 


నే: హలో 
అ: హలో, రాజేష్ ఏ న అమ్మా మాట్లాడేది..
నే: అవునండి...
అ: మీ బయో-డేటా చూసాము.. మా అమ్మాయి MBA చేసింది. మీరు ఉండేది ఎక్కడమ్మా? 
నే: వనస్తలిపురం అండి..
అ: ఓహో... ప్రాపర్ ఇక్కడే అనమాట...
నే: లేదండి... నల్గొండ..
అ: ఓహో.. పేరెంట్స్ అక్కడే ఉంటారనమాట...
నే: లేదండి... ఇప్పుడు అందరం ఇక్కడే ఉంటున్నాం.. 
అ: ఓహో... గుడ్... సొంతిల్లె అనమాట...
నే: లేదండి.. రెంట్.. 
అ: .......
అ: .......
అ: .......
అ: సరేనమ్మ.. నేను మళ్ళీ కాల్ చేస్తాను...




కాల్ చేసింది పెళ్లి గురించి కాదు... ఇల్లు గురించని ఒక్కసారి చెప్పి ఉండాల్సింది కదా మొదట్లోనే?? 
అనవసరంగా ఇద్దరి సమయం వృధా.. 


అయినా, సొంతిల్లు ఉంటె అబ్బాయి రాక్షసుడయినా పర్లేదా?? ఏంటో జనాలు.. 
పాత కాలమే నయం... అసలు అబ్బాయి కి జాబు కూడా లేనప్పుడే పిల్లనిచ్చేవారు.. 


చివరగా .. ఆడపిల్లల తల్లిదండ్రులకు... 
------------------------------------------
"త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు.. అబ్బాయిని వెతికేప్పుడు చూడాల్సింది... ఆస్తి ఉన్నోడా.. అప్పులు లేనోడా అని కాదు... మంచి లక్షణాలు ఉన్నోడా... చెడు అలవాట్లు లేనోడా అని .. "







7 comments:

Indian Minerva said...

అసలీ ఇల్లుగోలకూడ నాకర్ధంకాదు. జీవితాన్నీ, జీతాన్నీ ధారపోసి నానాకష్టాలు పడి ఒక ఇల్లుకొనుక్కోని (ఇప్పుడైతే ముందుగా ఇల్లుకొనుక్కొని తరువాత కష్టాలు పడుతున్నారు) తీరా దాంట్లో ఉండేది మహావుంటే పదేళ్ళు తరువాత రోగాలు, రొష్టులూ, వీలునామాలు, ఆస్తిపంపకాలు. అదేదో ఉన్నడబ్బుతో ఆనందంగా జీవించుంటే ఆరోగ్యమూ, ఆనందమూ దక్కుతాయికదా.

Life style గురించి ఆలోచించకుండా ఇల్లుగురించి ఎందుకు ఆలోచిస్తారో నాకర్ధంకాదు జనాలు.

Neha said...

అన్ని ఎంక్వరీస్ చేసాక కూడా పెళ్లి చేసాక ఆ అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉన్నారని guarrenty ఇవ్వగలరా తల్లిదండ్రులు ? ఏదో వాళ్ళ తృప్తి కోసం అవన్నీ చేస్తారు అంతే! పెళ్లి కి ముందు మంచి అలవాట్లు ఉన్నాయా లేదా అని చూసి చేసిన అవి పెళ్లి ఐయ్యక అలాగే ఉంటాయని guarrenty ఇవ్వలేరు ఎవరూ..

Neha said...

అన్ని ఎంక్వరీస్ చేసాక కూడా పెళ్లి చేసాక ఆ అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉన్నారని guarrenty ఇవ్వగలరా తల్లిదండ్రులు ? ఏదో వాళ్ళ తృప్తి కోసం అవన్నీ చేస్తారు అంతే! పెళ్లి కి ముందు మంచి అలవాట్లు ఉన్నాయా లేదా అని చూసి చేసిన అవి పెళ్లి ఐయ్యక అలాగే ఉంటాయని guarrenty ఇవ్వలేరు ఎవరూ..

రాజేష్ మారం... said...

@Indian Minerva... అవునండి... :(

రాజేష్ మారం... said...

@Neha... పెళ్ళికి ముందు లేని అలవాట్లు పెళ్లి తర్వాత వస్తాయంటే... అందులో భార్య భాద్యత కచ్చితంగా ఉంది ఉంటుందని నా నమ్మకం... కాదంటారా??

MOORKUDU said...

ఇప్పుడు అమ్మాయిలు కాదు అబ్బాయిలు ఎంక్వయిరీ చేసుకునే రోజులు వచ్చాయి. ముందు అమ్మాయి గురించి కాదు వాళ్ళ కుటుంబం గురించి. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమని పెద్దలు ఊరికే చెప్పలేదు. రాజేష్ నీ అనుమానం నిజమే.

MOORKUDU said...

పెళ్ళికి ముందే అమ్మాయి గురించి కాకుండా వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వయిరీ చేసుకునే పాత పద్దతులు పాటిస్తే మంచిది. ఇప్పుడు అరిటాకు మొగవాడు అయ్యాడు. రాజేష్ నీ అనుమానం నిజమే.