August 3, 2011

ముఖంపై నల్ల మచ్చలా?.... - నల్ల మచ్చలు కనిపిస్తే ఒట్టు.....

మా ఆఫీసు లో నాతో పాటే జాయిన్ అయిన స్నేహితుడోకడున్నాడు.


ప్రాజెక్టులు వేరు వేరు అవడం చేత వాడిది రెండవ అంతస్తు, నాది మొదటి అంతస్తు.


వారానికి రెండు సార్లు కాఫీ బ్రేక్ కి కలసి వెళ్లి కష్టసుఖాలు చెప్పుకుంటాం.


ఆమధ్య వాడికో సమస్య వచ్చి పడింది.


ఏంటంటే ముఖంపై నాలుగైదు నల్ల మచ్చలు.


ఇక వీడు బెంగేట్టేసుకున్నాడు.


వీడి రంగు చమన చాయ అవటం తో... అవి కనీ కనిపించనట్టు ఉన్నాయనుకోండి... అది వేరే విషయం...


కాని, అసలే పెళ్లి కావాల్సిన వయసు, పైగా ఇంట్లో సంబంధాలు చూడటం మొదలెట్టేసారు.


ఇక బెంగేట్టుకోడా మరి.


జగన్ లా మనం ఓదార్చాల్సినంత  పెద్ద సమస్యేం కాదు.... అలా అని చిన్న సమస్య కూడా కాదు...


సర్లే ఒక వారం చూద్దామని చెప్పాను.


మరుసటి వారం కలిసినప్పుడు మార్పేమీ గమనించలేదు... మచ్చల విషయంలోను, వాడి బాధ విషయంలోను...


ఇంకో వారం చూద్దామని వాడు డిసైడ్ అయ్యాడు... అంతలోనే వారం గడచిపోయింది...


ఇక లాభం లేదని గూగుల్ లో మంచి క్రీముల కోసం సెర్చ్ చేయటం ప్రారంభించాడు.


రెండురోజుల తర్వాత కలిసినప్పుడు, యుద్ధం గెలవడానికి తిరుగులేని ఆయుదమేదో సాదించినట్టు వెలిగిపోతుంది వాడి ముఖం.


ఆరాతీస్తే చెప్పాడు, ఒక క్రీము పేరు... దాన్ని కొనేసాడు ఆ ఉదయమే అని...


ఇదే ఎందుకని నా ప్రశ్న, కాప్షన్ వాడి జవాబు...


కాప్షన్ ఏంటంటే...


"ముఖంపై నల్ల మచ్చలా? మా క్రీము వాడండి ఒక వారం రోజులు.... నల్ల మచ్చలు కనిపిస్తే ఒట్టు..."


నాకు కూడా బానే ఉందనిపించింది...


నా ప్రాజెక్టు పీక్ స్టేజి లో ఉండడం చేత, ఒక వారం కలవడానికి వీలు పడలేదు....


మరు వారం వాడి పని ఒత్తిడి కారణంగా కలవలేదు....


తరువాతి వారం వాడ్ని చూసినప్పుడు.... ఆశ్చర్యం... నాకు నోట మాటరాలేదు....


ఆర్య-2 సినిమా లో పాడినట్టు "లేన్సేసి.... వెతుకు..... దొరకదు ఏ డిఫెక్ట్...",


బూతద్దం వేసి వెతికినా నల్ల మచ్చలు కనిపించవేమో...


@#$%#$^M & &**********


ఏంటి... మీ సమస్య కు పరిష్కారం దొరికిందని సంభర పడుతున్నారా?


ఆ క్రీము పేరేదో చెప్తే... నాకు రుణపడి పోదామనుకుంటున్నారా ????


ఆగండాగండి....


అసలు విషయమేంటంటే....


వాడి ముఖం నల్లగా మారిపోయింది... హతోస్మి ..... ఇక నల్ల మచ్చలెం కనిపిస్తాయి???


సారాంశం: పున్నమి చంద్రుడవుదామని ఆశ పడితే... అమావాస్య చంద్రుడయ్యాడు పాపం....





No comments: